ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్‌

హైదరాబాద్‌: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఖరారు చేసింది. అద్దంకి దయాకర్‌, బల్మూరి వెంకట్‌ను అభ్యర్థులుగా ప్రకటించింది. ఈమేరకు వారిద్దరికీ పార్టీ అధిష్ఠానం సమాచారమిచ్చింది. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈనెల 18 చివరి తేదీ కావడంతో బహుశా రేపు వారు నామినేషన్‌ వేసే అవకాశం ఉంది. ఈ నెల 29న ఎన్నికలు జరగనున్నాయి.

➡️