తెలంగాణ : స్ట్రాంగ్‌ రూంల వద్ద 144 సెక్షన్‌

తెలంగాణ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఇక ఓట్ల లెక్కింపు మిగిలి ఉండగా, పోలింగ్‌ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌లలో ఈవీఎం మెషిన్లను అధికారులు భద్రపరిచారు. దీంతో స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈవీఎంలను భద్రపరిచిన గదుల వద్దకు ఎవరినీ అనుమతించడం లేదు. మూడు షిఫ్టుల్లో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యే వరకు ఆ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. హైదరాబాద్‌ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, కాలేజీలు, గోదాముల్లో లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలవారీగా కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

➡️