యువగళం పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్‌

  • తుపాను కారణంగా మూడు రోజుల విరామం

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి : తీవ్ర తుపాను కారణంగా యువగళం పాదయాత్రకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మూడు రోజులు విరామం ప్రకటించారు. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండల పొన్నాడ శీలంవారిపాకల వద్ద యువగళం పాదయాత్ర నిలిచింది. ఆదివారం సాయంత్రం వరకూ కొనసాగిన యాత్ర సోమవారం నుంచి నిలుపుదల చేశారు. తుపాను కారణంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురవడంతోపాటు, ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో తుపాను ప్రభావం తగ్గిన తరువాత ఈ నెల ఏడున శీలంవారిపాకల నుంచి యువగళం యాత్ర ప్రారంభమవుతుందని లోకేష్‌ ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రానికి మిచౌంగ్‌ తుపాన్‌ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని సూచించారు. సహాయక చర్యల్లో టిడిపి నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.

➡️