తిరుపతిలో ఉద్రిక్తత..ఒంటిపై పెట్రోల్ పోసుకున్న పులివర్తి నాని

Jan 8,2024 16:31 #Dharna, #TDP, #tirupathi, #YCP

ప్రజాశక్తి-క్యాంపస్‌(తిరుపతి): .దొంగ, బోగస్‌ ఓట్లుపై చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సమరభేరి మోగించారు. ఉదయం నుంచి చంద్రగిరి ఆర్డీవో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని నాని నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. దొంగ ఓట్లు తొలగించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి కనుసన్నల్లో ఈ తతంగం జరిగిందని ఆరోపణ. బాధ్యులపై చర్యలు తీసుకుని ఓటర్లు జాబితా నిష్పక్షపాతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో వారికి పోటీగా అధికార వైసిపి నేతలు కలిసి అక్కడే నిరసనకు దిగారు. ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అరెస్టు్ల చేశారు. ఈ క్రమంలో పోలీసుల అరెస్టును నిరసిస్తూ.. పులివర్తి నాని ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆయన్ను అడ్డకుకున్నారు.

➡️