పోలింగ్‌ తర్వాతే పథకాల సొమ్ము జమ చేయండి..! :ఎన్నికల సంఘం

ప్రజాశక్తి-అమరావతి : ప్రజాశక్తి-అమరావతి : ఎన్నికల వేళ సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులను లబ్దిదారుల ఖాతాల్లో జమచేయాలని చూసిన వైసీపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం భారీ షాక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన ఆదేశాలు సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలో సంక్షేమ పథకాల సొమ్ముల చెల్లింపునకు కేంద్ర ఎన్నికల సంఘం నో చెప్పింది. ఈ సొమ్ములు చెల్లిస్తే ఎన్నికల ప్రక్రియలోని సైలెంట్‌ పిరియడ్‌కు విఘాతం కలుగుతుందని ఈసీ తేల్చి చెప్పింది. మే 13 పోలింగ్‌ తేదీ తర్వాత లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయవచ్చని కోర్టు దృష్టికి ఈసీ తీసుకెళ్లింది.ఇక, రైతులకు ఇన్‌ పుట్‌ సబ్సిడీ ఇవ్వాలనే అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ సాగుతోంది.

➡️