ప్రధాన నిందితుడు ప్రభాకర్‌ రావే… తేల్చేసిన పోలీసులు

May 4,2024 16:15 #hyderabad, #Phone Tapping Case

హైదరాబాద్‌: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావే ప్రధాన నిందితుడిగా పోలీసులు తేల్చేశారు. ప్రభాకర్‌ రావును ప్రధాన నిందితుడిగా చేర్చుతూ కోర్టులో మెమో దాఖలు చేశారు. ప్రభాకర్‌ రావుతో పాటు ప్రైవేట్‌ వ్యక్తిని ఖాకీలు నిందితుడిగా చేర్చారు. ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌తో పాటు ప్రైవేట్‌ వ్యక్తి పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రభాకర్‌ రావు కనుసన్నల్లోనే ఫోన్‌ టాపింగ్‌ జరిగిందని పోలీసులు నిర్ధారించారు.
ఎస్‌ఐబీలోని హార్డ్‌ డిస్క్‌ ధ్వంసంలో ప్రధాన సూత్రధారి ప్రభాకర్‌ రావు అని.. ఆయన ఆదేశాలతోనే ప్రణీత్‌ రావు హార్డ్‌ డిస్క్‌ ధ్వంసం చేసినట్లు విచారణలో బయటపడింది. ప్రభాకర్‌ రావు చెప్పిన నెంబర్లను ప్రణీత్‌ రావు టాపింగ్‌ చేసినట్లు బయటపడింది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు తర్వాత ప్రభాకర్‌ రావు అమెరికా వెళ్ళిపోయారు. దీంతో ప్రభాకర్‌ రావు కోసం ఇప్పటికే పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే.

➡️