పానకాల స్వామికి కిరీటాన్ని సమర్పించిన నారా కుటుంబం

Jan 8,2024 08:07 #Nara Lokesh, #pujalu

ప్రజాశక్తి- మంగళగిరి (గుంటూరు జిల్లా):మంగళగిరిలోని ప్రముఖ ఆలయాలను టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కుటుంబ సమేతంగా ఆదివారం సందర్శించారు. తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మిణి, తనయుడు దేవాన్ష్‌తో కలిసి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. మంగళగిరిలోని పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారికి కిరీటం అలంకరించారు. అలాగే చెంచులక్ష్మి అమ్మవారికి, రాజ్యలక్ష్మి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ ఇఒ ఎ రామకోటిరెడ్డి వారికి స్వాగతం పలికారు.

➡️