‘ఉక్కు’ పరిరక్షణే ధ్యేయం

May 12,2024 21:57 #ukkunagaram, #vizag steel
visakha-steel-plant manganese mines

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణే ధ్యేయంగా కార్మికవర్గం పోరాడుతోందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు నీరుకొండ రామచంద్రరావు అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 1186వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో స్టీల్‌ కాంట్రాక్టు కార్మికులు, ఐఎన్‌టియుసి కార్యకర్తలు కూర్చున్నారు. వారినుద్దేశించి రామచంద్రరావు మాట్లాడుతూ కార్మికుల హక్కులను పరిరక్షించుకోవడానికి, దేశాభివృద్ధికి స్టీల్‌ప్లాంట్‌ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవటం ఎంతైనా అవసరమని అన్నారు. ఈ ఎన్నికల్లో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించే నాయకులకే ఓటు వేసి కార్మికులు గెలిపించుకోవాలని కోరారు. స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కోసం రాజీలేని పోరాటం చేస్తామన్నారు. మున్ముందు జరిగే పోరాటాల్లోనూ కార్మికవర్గం పెద్ద సంఖ్యలో పాల్గనాలని పిలుపునిచ్చారు.

➡️