మృతదేహాన్ని ఇంటికి చేర్చుకోలేని దుస్థితి..

Apr 10,2024 12:44 #ys sharmila

ఏపీసిసి చీఫ్ షర్మిలా రెడ్డి  

ఇంటర్నెట్ : రాష్ట్రంలో రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడంలో విఫలమైన వైసిపి ప్రభుత్వంపై ఏపీసిసి చీఫ్ షర్మిలా రెడ్డి ఘాటుగా స్పందించారు. ”మీ ఇంటికి, మీ గ్రామానికి మేలు చేస్తేనే ఓటు వెయ్యండి అని అడిగేవాళ్లకు ఈ వార్త చూసైనా కనువిప్పు కలగాలి. ఆరోగ్యశ్రీని అట్టకెక్కించడంతో ఆసుపత్రిలో సరైన వైద్యం ఎలాగూ అందటంలేదు.. కనీసం చనిపోయిన మృతదేహాన్ని కూడా ఇంటికి చేర్చుకోలేని దుస్థితిలో ప్రజలు ఉన్నారంటే అధికార పార్టీ సిగ్గుపడాలి. మేము అది చేసాం ఇది చేసాం అని డబ్బాలు కొట్టుకోవటం కాదు. పేదోడి కనీస అవసరాలు తీర్చలేని మీ ప్రభుత్వం ఎందుకు? మళ్లీ మీరు రాజన్న వారసులం అని చెప్పుకుంటారు? ఇలానే ఉంటుందా రాజన్న పాలనా? అందుకే చెబుతున్నాం ఓటు అనే ఆయుధంతో వీళ్లకు బుద్ది చెప్పండి.” అంటూ వైఎస్ షర్మిలా రెడ్డి ఎక్స్ లో పోస్ట్ చేశారు. బిడ్డ మృతదేహాంతో 8 కిమీ నడక… అనే పత్రికలో వచ్చిన క్లిప్ ని జతచేసారు.

➡️