యాజమాన్యం నిర్లక్ష్యంతో మహిళ మృతి!

ప్రజాశక్తి-లేపాక్షి : క్వారీ యాజమాన్యం నిర్లక్ష్యంతో పేలుడు జరపగా పెద్ద బండరాయి సమీపంలో వంట గదిలో ఉన్న మహిళ తలకు తగలడంతో ఆమె మృతి చెందింది. క్వారీ నిర్వాహకుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి తీసుకున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలు అనంతపురం జిల్లా లేపాక్షి మండలం భయ్యన్నాపల్లి గ్రామం సమీపాన గ్రానైట్ క్యూరిలో పనిచేస్తున్న మామిడిమకులపల్లికి  చెందిన ఈడీగా కిష్టమ్మా(55) గా స్థానికులు చెబుతున్నారు. క్వారీలో వంట పనికి వెళ్తున్నట్టు సమాచారం. పేలుడు సందర్భంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు ఎన్నిసార్లు చెప్పినా ఎలాంటి భద్రత లేకుండా యాజమాన్యం వహిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైనా ఏదైనా మాట్లాడితే మీ అంత చూస్తామంటూ కూడా బెదిరించినట్టు స్థానికులు వాపోయారు. ఈరోజు ఈమె ప్రాణం పోవడానికి సంబంధిత అధికారులు క్వారీ యాజమాన్యమే కారణం అంటున్నారు స్థానికులు.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️