శ్రీకాకుళంలో మూడు కోవిడ్‌ కేసులు

Dec 25,2023 21:30 #Covid Cases, #srikakulam

ప్రజాశక్తి-శ్రీకాకుళం ప్రతినిధి: శ్రీకాకుళం జిల్లాలో సోమవారం మూడు కోవిడ్‌ కేసులు వెలుగు చూశాయి. మెళియాపుట్టి మండలం దుర్భలాపురానికి చెందిన 73 ఏళ్ల వృద్ధుడు కోవిడ్‌ లక్షణాలతో ఈ నెల 16న శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రిలో చేరారు. విటిఎం పరీక్షలు నిర్వహించగా ఈ నెల 24న కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం సర్వజన ఆస్పత్రి కోవిడ్‌ ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కోవిడ్‌ వేరియంట్‌ నిర్ధారణ కోసం విజయవాడలోని ల్యాబ్‌కు పంపారు. సోమవారం మరో ఇద్దరు కోవిడ్‌ బారిన పడ్డారు. కొత్తూరు మండలం కుద్దిగాంకు చెందిన 60 ఏళ్ల వృద్ధునికి, శ్రీకాకుళం నగరం కంపోస్టు కాలనీకి చెందిన 50 ఏళ్ల ఓ మహిళకు కోవిడ్‌ సోకింది. వీరిద్దరికీ రిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

➡️