నేడు ‘ప్రజాగళం’ సభ

Mar 17,2024 08:27 #meeting, #tdp-janasena-bjp

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి-జనసేన-బిజెపి చిలకలూరిపేటలో నిర్వహిస్తున్న ప్రజాగళం సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మూడు మధ్య పొత్తు కుదిరిన తర్వాత ఉమ్మడిగా నిర్వహిస్తున్న తొలి సభ ఇది. దీంతో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నాయి. సుమారు 10 లక్షల మంది వస్తారని ఆ పార్టీల నేతలు అంచనా వేస్తున్నారు. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోడీ, టిడిపి, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ హాజరుకానున్నారు. అలాగే పార్టీకి పది మంది చొప్పున సీనియర్‌ నాయకులు వేదికపై ఉంటారు. మోడీ కోసం మూడు హెలీప్యాడ్లు, చంద్రబాబు, పవన్‌ కోసం మరో మూడు హెలీప్యాడ్లు సిద్ధం చేశారు. మోడీ హైదరాబాద్‌ నుంచి గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో ఆదివారం చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 5 గంటలకు సభా ప్రాంగాణానికి చేరుకుంటారు. చంద్రబాబు, పవన్‌ 4.30 గంటలకు సభ ప్రాంగణానినికి ప్రత్యేక హెలీకాప్టర్లలో రానున్నారు.

➡️