పట్టాలు ఇచ్చారు… స్థలాలు చూపించలేదు..!

Mar 5,2024 10:47 #house sites, #Kakinada, #places

ప్రజాశక్తి – తాళ్లరేవు (కాకినాడ) : జగనన్న ఇళ్ల స్థలాల పేరుతో పట్టాలు ఇచ్చి రెండేళ్లు గడిచినప్పటికీ నేటికీ స్థలాలు చూపించలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టేకుమూడి ఈశ్వరరావు ఆరోపించారు. ఎన్నికల కోడ్‌ రాకముందే లబ్ధిదారులకు వెంటనే స్థలాలు చూపించాలని తాళ్లరేవు మండల డిప్యూటీ తహశీల్దార్‌ సూరిబాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఈశ్వరరావు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పటవల, కోరంగి , తాళ్ళరేవు గ్రామానికి చెందిన కొంతమందికి బొడ్డువానిలంక గ్రామం లోనూ, తాళ్లరేవు గ్రామానికి చెందిన కొంతమందికి గాడిమొగ గ్రామంలో పట్టాలు ఇచ్చారని, నేటికీ లబ్ధిదారులకు స్థలాలు ఎక్కడ ఉన్నాయో చూపించలేదని తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా అధికారులు వెంటనే స్పందించి పట్టాలు పొందిన లబ్ధిదారులకు ఆయా గ్రామాలలో స్థలాలు కొలిచి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. తాగునీటి సమస్య పరిష్కరించాలి : తాళ్లరేవు గ్రామంలో యాదవుల ఏరియా, రచ్చ వారి పేట ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని, సమస్యను పరిష్కరించాలని తాళ్ళరేవు ఈవో పి ఆర్‌ ఆర్‌ డి మల్లాడి భైరవమూర్తికి స్థానిక ప్రజలతో కలిసి ఈశ్వరరావు వినతిపత్రం అందజేశారు.

➡️