వాలంటీర్ వేధింపులు భరించలేక బాలిక ఆత్మహత్యాయత్నం

ప్రజాశక్తి-నరసరావుపేట : పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పాలపాడులో వాలంటీర్ వేధింపులు భరించలేక బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తనను ప్రేమించాలని వాలంటీర్ పిట్టు శ్రీకాంత్ రెడ్డి  గ్రామానికి చెందిన ఇద్దరు అక్క, చెల్లెలకు కొన్ని నెలలుగా నరకం చూపించాడు. ఈ వేధింపులు భరించలేక ఎలుకల మందు తాగి చెల్లెలు ఆత్మహత్యాయత్నం చేసుకుంది. బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో నరసరావుపేటలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. దీంతో వాలంటీర్ ఆకృత్యాలు బయటపడ్డాయి. ఇప్పటికే వేధింపులకి భయపడి పెద్ద కూతురుకి ట్రిపుల్ ఐటీ సీటు వచ్చినా ఆమె తల్లిదండ్రులు కాలేజీకి పంపలేదు. అక్క అందుబాటులో లేకపోవడంతో చెల్లిని టార్గెట్ చేసిన వాలంటీర్ శ్రీకాంత్ వేధింపులు పెరిగాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️