80 వానరాలు మృతి

Mar 4,2024 20:10 #monkeys, #Sri Satya Sai District
Unknown people killed the monkeys

విషప్రయోగం జరిగిందని అనుమానాలు

ప్రజాశక్తి-రొద్దం (సత్యసాయి జిల్లా) : శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలో భారీ సంఖ్యలో వానరాలు మృత్యువాత పడ్డాయి. వీటి మరణంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గ్రామస్తుల వివరాల మేరకు.. శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం చొలేమర్రి గ్రామ సమీపంలో దాదాపు 80 కోతులు మరణించి ఉన్నాయి. అటుగా వెళ్తున్న గ్రామస్తులు గుర్తించి విషయాన్ని అధికారులకు తెలియజేశారు. పెద్ద ఎత్తున కోతులు మృతి చెందడంతో ఒక్కసారిగా గ్రామస్తులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు విషప్రయోగం చేసి వానరాలను చంపి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కోతుల నుంచి అధికారులు నమూనాలు సేకరించారు. పంచనామ అనంతరం అక్కడే గోయ్యి తవ్వి పూడ్చిపెట్టారు.

➡️