యూటీఎఫ్‌ ‘చలో విజయవాడ’ ఉద్రిక్తత.. నాయకులు అరెస్టు

Jan 9,2024 11:20

ప్రజాశక్తి-విజయవాడ: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్‌ పిలుపునిచ్చిన ‘చలో విజయవాడ’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. నగరంలోని జింఖానా మైదానంలో నిరసనకు అనుమతి కోరగా.. పోలీసులు నిరాకరించారు. దీంతో యూటీఎఫ్‌ నాయకులు, ఉపాధ్యాయులు విజయవాడ లెనిన్‌ సెంటర్‌కు భారీగా చేరుకుని ఆందోళన చేపట్టారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించి అధ్యక్ష, కార్యదర్శులను నిర్బంధించారు.

➡️