యుటిఎఫ్‌ 12 గంటల పోరుబాట

Jan 3,2024 12:15 #Dharna, #utf

ప్రజాశక్తి-అంబేద్కర్‌ కోనసీమ : డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో యుటిఎఫ్‌ ఉపాధ్యాయులు కలెక్టరేట్‌ వద్ద బుధవారం పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. పిఆర్‌సి, డిఎ చెల్లించాలని, ప్రతి నెల ఒకటో తేదీన జీతం చెల్లించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ధర్నాకు ఎమ్మెల్సీ ఐవి పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు, పెన్షనర్స్‌కు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు, పెన్షన్లు ఇవ్వాలన్నారు. 12వ పీఆర్సీకి అతీగతీలేకుండా పోయిందని తెలిపారు. పీఆర్సీ, డీఏ ,పీఎఫ్‌, ఏపీజీఎల్‌ బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ‘పోరుబాట’కు పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని మద్దతు తెలిపారు.

డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ధర్నా
చిత్తూరు జిల్లాలో యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా
ప్రకాశం జిల్లాలో యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా
యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద 12 గంటల ధర్నా

 

➡️