రాజన్న ఆలయంలో ముగియనున్న ఉత్సవాలు – నేడు, రేపు ఆర్జిత సేవలు రద్దు

రాజన్నసిరిసిల్ల : రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో ఐదు రోజులపాటు జరిగే శివ కల్యాణోత్సవ వేడుకలు నేటితో ముగుస్తాయి. ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవురోజు కావడంతో స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో భక్తులు క్యూకట్టారు. దర్శనానికి మూడు గంటల సమయం పడుతుండటంతో భక్తులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. భక్తుల రద్దీ కారణంగా ఆలయ అధికారులు ఈరోజు, రేపు గర్భాలయంలో భక్తులతో నిర్వహించే ఆర్చిత సేవలను రద్దు చేశారు. శివ కళ్యాణ ఉత్సవాలు మొదటిరోజు శ్రీ పార్వతీ రాజరాజేశ్వరి స్వామివార్ల కల్యాణోత్సవాన్ని ఆలయ వేద పండితులతో అంగరంగ వైభవంగా ఉదయం 8.05 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను చూడటానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు వేములవాడకు తరలివస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

➡️