ఓటేసిన సిఎం దంపతులు

May 13,2024 22:30 #ap cm jagan, #pulivendula, #voted

ప్రజాశక్తి- పులివెందుల టౌన్‌ :సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తమ ఓటు హక్కును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్‌.భారతి వినియోగించుకున్నారు. పులివెందుల పట్టణంలోని బాకరాపురం 138/129 పోలింగ్‌ కేంద్రంలో తమ ఓట్లను వేశారు. అనంతరం మీడియాతో సిఎం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఓటేయాలని కోరారు. చిన్నారులు, అభిమానులతో వైఎస్‌ భారతి ఫొటోలు దిగి సందడి చేశారు. అనంతరం హెలికాప్టర్‌ ద్వారా నుంచి బయలుదేరి కడప విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్నారు.

➡️