ఏడువేల నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ- సచివాలయ విఆర్‌ఒ సస్పెండ్‌

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (కృష్ణా) :నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన కృష్ణా జిల్లా మచిలీపట్నం 11వ డివిజన్‌ సచివాలయ విఆర్‌ఒను సస్పెండ్‌ చేశారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మ ఆదేశాల మేరకు ఆర్‌డిఒ తొలగించారు. హద్దులు, సర్వే నంబర్‌, సంతకం లేకుండా 11,000 నకిలీ ఇళ్ల పట్టాలు తయారు చేశారు. అందులో ఏడువేల పట్టాలను విఆర్‌ఒ శ్రీదేవి పంపిణీ చేశారు. దీనిపై పలువురు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులకు తెలియకుండా వైసిపి నేతల ద్వారా లబ్ధిదారులకు నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్లు విచారణలో తేలడంతో విఆర్‌ఒను సస్పెండ్‌ చేసినట్లు ఆర్‌డిఒ ఎం. వాణి తెలిపారు. స్థానిక శాసనసభ్యుల పేర్ని వెంకట్రామయ్య ప్రోద్బలంతో రెవెన్యూ అధికారులు దొంగ పట్టాలు పంపిణీ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని జిల్లా కలెక్టర్‌కు గతంలో మాజీ మంత్రి టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ఫిర్యాదు చేశారు.

➡️