బిజెపితో మైత్రికోసం ఆరాటం దేనికి?

బాబు, పవన్‌ల ఢిల్లీ పర్యటన మతలబు ఏమిటి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : బి జెపి నుంచి పిలుపు రాగానే వాయువేగంతో ఢిల్లీకి వెళ్లిన తెలుగుదేశం- జనసేన నేతలు ఆ పార్టీతో పొత్తును ఖరారు చేసుకున్నారు. అధికారికంగా ప్రకటించడమే తరువాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ద్రోహం చేసినా, పొలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయకపోయినా, విభజన చట్టంలోని హామీల ను తుంగలో తొక్కినా బిజెపితో చెలిమికే ఈ రెండు పార్టీలు మొగ్గు చూపాయి.ఒక్కశాతం ఓట్లు కూడా లేని బిజెపి2019 ఎన్నికల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేసిన బిజెపి 2,63,849 ఓట్లు పొందింది. అంటే పోలైన ఓట్లలో 0.84 శాతం మాత్రమే. 2014లో పొత్తులో భాగంగా నాలుగు ఎమ్మెల్యే సీట్లు గెలిచినా, 2019లో ఒక్క ఎమ్మెల్యే సీటును కూడా బిజెపికి దక్కలేదు. ఎందుకంత ఆరాటమన్నదే ప్రశ్నవైసిపి, టిడిపిలను కేసుల భయం వెంటాడుతోంది. అధికారం కోసం విలువలకు తిలోదకాలు ఇస్తున్న వైసిపి, టిడిపిలు రాష్ట్రంలో కత్తులు దూసుకుంటున్నా కేంద్రంలో బిజెపి ప్రభుత్వానికి చెరోక వైపు పల్లకి మోస్తున్నాయి. బిజెపి ముందు సాష్టాంగ పడిన పార్టీలు తెలుగు జాతి గౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టడాన్ని చూసి పలువురు ఔరా! అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వెంటనే జైల్లోకి వెళ్లేందుకు సిద్ధంగా కేసులు ఉండటం, వాటిని కేంద్ర ప్రభుత్వం నియంత్రిస్తుండటంతో ఇద్దరు నాయకులూ బిజెపి అడుగులకు మడుగులు వత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల చంద్రబాబును జైలుకు పంపడంలో బిజెపి తనవంతు పాత్ర పోషించి ఆయన్ను కాళ్లబేరానికి తెచ్చుకున్న సంగతి తెలిసిందే. బిజెపి భజనే… రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తామని, కేంద్రం మెడలు వంచి మరీ విభజన హక్కులు సాధించుకొస్తామని చెప్పి, అత్యధిక ఎంపి సీట్లు గెలిచిన వైసిపి గడిచిన అయిదేళ్లు బిజెపికి సంపూర్ణ మద్దతు తెలిపింది. ఉభయసభలు కలుపుకుని పార్లమెంట్‌లో 30 మంది ఎంపిలు ఉన్నాసరే రాష్ట్రానికి సంబంధించిన ఒక్క హామీని గానీ, హక్కును గానీ సాధించలేకపోయింది. ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి బిజెపితో పొత్తుకోసం పాకులాడుతోంది. రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ స్థానాలకు గానూ ఇప్పటికే టిడిపి 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిత్రపక్షం జనసేన 24 సీట్లలో తమ అభ్యర్థులను నిలబెడుతోంది. మిగిలిన సీట్లలో బిజెపితో పొత్తుపై చర్చించి, నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ పొత్తు కుదిరితే బిజెపి నాలుగు నుంచి అయిదు పార్లమెంట్‌ స్థానాలు, ఏడు నుంచి 10 అసెంబ్లీ స్థానాల్లో తమ అభ్యర్థులను కూటమి తరపున నిలబెట్టే అవకాశం ఉంది.

➡️