యువకుడి ప్రాణం తీసిన వేట   

Jan 13,2024 12:30 #Chittoor District
young death in hunt

ప్రజాశక్తి-బంగారుపాళ్యం: వేట ఓ యువకుడి ప్రాణం తీసింది. పొదల్లో కదలికను మృగమని భావించి నాటు తుపాకీతో యువకుడిని కాల్చారు. ఈ  ఘటన శుక్రవారం రాత్రి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలోని ఎగువ కంతల చెరువు గ్రామంలో చోటుచేసుకున్నది. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఎగువ కంతల చెరువు గ్రామానికి చెందిన బాబు కుమారుడు ఉమాపతి (22) తన స్నేహితులతో అడవికి వేటకు వెళ్ళగా నాటు తుపాకీతో మృగమని కాల్చారని ప్రాధమిక సమాచారంగా తెలిపారు. ఈ సంఘటనలో ఉమాపతి అక్కడికక్కడే మృతి చెందారు. శవ పరీక్ష నిమిత్తం బంగారుపాలెం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్టు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️