భీమవరం చేరుకున్న సీఎం వైఎస్ జగన్

ys jagan reached bhimavaram vidya deevena

 

భీమవరం : జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా 2023–24 విద్యా సంవత్సరంలో జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన విద్యార్దులకు నిధులు విడుదల చేసేందుకు సీఎం వైఎస్ జగన్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చేరుకున్నారు. ఈ క్రమంలో 3 కిలోమీటర్ల మేర రోడ్‌షోలో పాల్గొననున్నారు. భీమవరం చేరుకున్న సీఎంకు మంత్రులు తానేటి వనిత, కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు, విప్ గ్రంథి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ప్రశాంతి, డీఐజీ అశోక్ కుమార్, ఎస్పీ రవి ప్రకాష్‌ తదితరులు స్వాగతం పలికారు. 8,09,039 మంది విద్యార్థులకు రూ.584 కోట్లు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

➡️