బ్రేక్‌ఫాస్ట్‌లో కేక్‌ తినండి : సమంత సలహా

Dec 21,2023 15:59 #health, #movie, #samantha

 

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఎవరైనా ఉదయం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, దోస, చపాతి, మహా అయితే పూరీలు వంటివి తీసుకోవడం సహజం. కొంతమంది బ్రేక్‌ఫాస్ట్‌కి బదులుగా తృణధాన్యాలు.. మరి ఇంకేమైనా తీసుకుంటారు. అయితే కేక్‌ ఎవరైనా బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటారా? అది ఊహించడానికే విచిత్రంగా ఉంది కదూ..! కానీ ప్రముఖ హీరోయిన్‌ సమంత మాత్రం.. బ్రేక్‌ఫాస్ట్‌లో కేక్‌ ముక్కల్ని తీసుకోండి అని సలహా ఇస్తున్నారు. ప్రత్యేకించి క్రిస్మస్‌ రోజుల్లో తాను కేక్‌ని బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటుందట. దీనికి సంబంధించిన ఫొటోలు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

ఉదయాన్నే తీసుకునే ఆహారంలో.. స్వీట్‌ని తీసుకోవడం.. అందులోనూ కేక్‌ని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదా? అనే సందేహం కచ్చితంగా వస్తుంది. మనకు ఆరోగ్యానికి సంబంధించి ఎన్ని అనుమానాలున్నా.. బ్రేక్‌ఫాస్ట్‌లో కేక్‌ని తీసుకోవచ్చు అని డాక్టర్‌ మాన్వి లోహియా అనే వైద్యురాలు తెలిపారు. క్రిస్మస్‌ పండుగ సందర్భంగా కేక్‌లు కట్‌ చేయడం సహజం. ఇలాంటి ప్రత్యేక రోజుల్లో ఉదయాన్నే కేక్‌ని తింటే.. తర్వాత అధికంగా తినకుండా.. మితంగా ఆహారాన్ని తీసుకుంటారని మాన్వి చెప్పారు. కేక్‌ త్వరగా శక్తినిస్తుంది. మీకు నీరసంగా ఉంటే వెంటనే కేక్‌ని తింటే మీకు త్వరగా శక్తి వస్తుంది. అయితే మధుమేహవ్యాధిగ్రస్తులు మాత్రం తినకుండా ఉంటేనే మంచిది అని మాన్వి సలహా ఇచ్చారు.

➡️