టీచర్‌ బర్త్‌డేని వెరైటీగా ప్లాన్‌ చేసిన స్టూడెంట్స్‌

Feb 13,2024 18:12

ఇంటర్నెట్‌డెస్క్‌ : స్కూల్‌ డేస్‌లో స్టూడెంట్స్‌ టీచర్స్‌ని ఎంతో అభిమానిస్తారు. పెద్దయిన తర్వాత అచ్చం వారిలాగే ఉపాధ్యాయులు అవ్వాలని కూడా కోరుకుంటారు. అలా కలలు కంటారు. స్కూల్‌డేస్‌లో అప్పుడప్పుడు టీచర్‌ బర్త్‌డేకి చిన్న చిన్న గిఫ్ట్‌లు ఇస్తుంటారు. అయితే ఓ స్కూల్లో.. టీచర్‌ బర్త్‌డేని స్టూడెంట్స్‌ వెరైటీగా ప్లాన్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ స్టూడెంట్స్‌ ఏం ప్లాన్‌ చేశారంటే.. టీచర్‌ తరగతి గదిలోకి వచ్చేటప్పటికి స్టూడెంట్స్‌ అందరూ గుమిగూడి బాగా గొడవపడుతున్నట్లు కనిపించారు. దీంతో టీచర్‌ కంగారుపడి స్టూడెంట్స్‌ దగ్గరికి వచ్చి గుమిగూడి ఉన్న విద్యార్థులను విడదీసి సర్దిచెప్పబోయే ముందు.. సడెన్‌గా ఆ గుంపులోంచి ఓ స్టూడెంట్‌ టీచర్‌కి ఫ్లవర్‌ బొకే ఇచ్చి బర్త్‌డే విషెస్‌ చెప్పాడు. ఈ సంఘటనతో టీచర్‌ అవాక్కయ్యారు. ఆ తర్వాత టీచర్‌ నవ్వుకున్నారు. ఈ సంఘటన నేపాల్‌లోని బోర్డింగ్‌ స్కూల్‌ గండకి బోర్డింగ్‌ స్కూల్‌ (జీబిఎస్‌)లో జరిగింది. ఆ టీచర్‌ పేరు సుజన్‌. తన స్టూడెంట్స్‌.. తన బర్త్‌డేని స్పెషల్‌గా ట్రీట్‌ చేయడం సుజన్‌ సార్‌ మోములో నవ్వులు విరబూయడం ఈ వీడియోలో కనిపిస్తుంది.

https://www.instagram.com/reel/C3KCEGDBnrG/?utm_source=ig_embed&ig_rid=8ac0a2b0-b9b7-4c78-90a8-d59258db7ac3

➡️