హీరోయిన్‌ జ్యోతిక ఫిట్‌నెస్‌ రహస్యమేంటో తెలుసా..?!

Mar 18,2024 13:45

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ హీరోయిన్‌ జ్యోతిక కెరీర్‌ పీక్‌స్టేజ్‌లో ఉండగానే.. తాను ప్రేమించిన ప్రముఖ నటుడు సూర్యను వివాహం చేసుకుంది. ఆ తర్వాత పిల్లలు, కుటుంబ బాధ్యతలతో బిజీగా గడిపారు. మళ్లీ కొన్ని సంవత్సరాల తర్వాత జ్యోతిక సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించినప్పటి నుండి ఆమె మహిళా ప్రాధాన్యమున్న కథలను ఎంచుకుని నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. అటు కుటుంబ బాధ్యతలను, ఇటు సినిమాల్లో నటించడం రెండింటినీ ఆమె ఎంతో చక్కగా బ్యాలెన్స్‌ చేస్తున్నారు. మరి ఆమె ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఏంటో తెలుసుకుందామా…?!

– జ్యోతిక ఉదయాన్నే రన్నింగ్‌ చేస్తారట. ఉదయపు వేళ స్వచ్ఛమైన గాలిని పీల్చుతూ రన్నింగ్‌ చేయడం ఆమె ఫిట్‌నెస్‌కి ఓ కారణం. వ్యాయామాలు చేసిన తర్వాత గ్రీన్‌ టీ కానీ, లేదా కొబ్బరి నీటిని తీసుకుంటారట.

– జిమ్‌లో కొన్ని వ్యాయామాలు చేస్తారట. ఈ వ్యాయామాల అనంతరం స్విమ్మింగ్‌ లేదా స్పా వంటివి చేస్తారట. వీటివల్ల బాడీ చాలా కూల్‌గా ఉంటుంది. మానసిక ప్రశాంతత కూడా ఉంటుందని ఆమె చెప్పారు.

– జ్యోతిక వ్యాయామాలు చేసినప్పటికీ సమతుల్య ఆహారాన్ని తీసుకుంటారు. ఇవే ఆమె ఫిట్‌నెస్‌గా ఉండేందుకు కారణమని చెబుతున్నారు.

➡️