Health : తినే ముందు ద్రాక్షని ఎలా కడుగుతున్నారు?

Mar 28,2024 13:26 #grapes, #health

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఇప్పుడు మార్కెట్‌లో ఎక్కడ చూసినా ద్రాక్షనే కనిపిస్తుంది. ఈ సీజన్‌లో నీటి శాతం ఎక్కువగా ఉండే ద్రాక్షని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. కొంతమంది ద్రాక్షను చూడగానే.. వాటిని నీటితో శుభ్రం చేయకుండానే తినేస్తారు. ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

– ద్రాక్షను మామూలు నీటితో కడిగిన తర్వాత తిన్నా ప్రమాదమేనని న్యూట్రీషియన్లు చెబుతున్నారు. సాధారణ నీటితో వీటిని కడిగితే వాటిపై ఉండే బ్యాక్టీరియా తొలగిపోదని వైద్యులు చెబుతున్నారు.

– వెనిగర్‌, బేకింగ్‌ సోడా కలిపిన నీటిలో పావు గంట సేపు ద్రాక్షని నానబెట్టాలి. ఆ తర్వాత మళ్లీ నాలుగైదుసార్లు నీటితో కడగాలి. ఆపై వీటిని టిష్యూ పేపర్స్‌పై కానీ లేదా.. మెత్తటి వస్త్రంపై వేసి బాగా ఆరనివ్వాలి. ఆపై మీరు వీటిని గాలి చొరబడే ప్రదేశంలోనైనా ఉంచుకోవచ్చు. లేదా మీ అవసరాలకు తగ్గట్టుగా ఎయిర్‌టైట్‌ కంటైనర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే కొద్దిరోజులు తాజాగా ఉంటాయి. వీటి రుచిలో కూడా ఎటువంటి తేడా ఉండదు.

– ఇలా శుభ్రం చేసిన ద్రాక్షను తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

➡️