ఐఐఎఫ్‌ఎల్‌ సమస్తా బాండ్లపై 10.50శాతం వడ్డీ

Dec 6,2023 21:23 #Business

హైదరాబాద్‌ : బ్యాంకింగేతర విత్త సంస్థ, మైక్రోఫైనాన్స్‌ కంపెనీ ఐఐఎఫ్‌ఎల్‌ సమస్తా రూ.1,000 కోట్ల నిధులను సమీకరించనున్నట్లు ఆ సంస్థ ట్రెజరీ హెడ్‌ మోహన్‌ కుమార్‌ తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇందుకోసం తమ సంస్థ జారీ చేయనున్న నాన్‌ కన్వర్టెడ్‌ డిబెంచర్‌ (ఎన్‌సిడి) సెక్యూర్డ్‌ బాండ్లపై 10.50 శాతం వడ్డీ రేటు అందించనుందన్నారు. 24, 36, 60 నెలల కాలపరిమితితో కూడిన బాండ్లపై నెలసరి లేదా ఏడాదికి ఒక్క సారి వడ్డీ రేటును పొందవచ్చని పేర్కొన్నారు. ఈ ఇష్యూ డిసెంబర్‌ 4న ప్రారంభమై.. 15న ముగుస్తుందన్నారు. తమ సంస్థ వ్యవసాయ కార్మికులు, కూరగాయలు, పూలు అమ్మేవారు, టైౖలర్లతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కార్మికుల కోసం తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వనున్నామన్నారు.

➡️