జమాటో, స్విగ్గీలకు జిఎస్‌టి నోటీసులు..!

Nov 22,2023 21:30 #Business

న్యూఢిల్లీ : ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థలైన జమాటో, స్విగ్గీలకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జిఎస్‌టి ఇంటెలిజెన్స్‌(డిజిజిఐ) నోటీసులు జారీ చేసిందని సమాచారం. జమాటో రూ.400 కోట్లు, స్విగ్గీ రూ.350 కోట్ల విలువైన జిఎస్‌టి ఎగవేశాయని రిపోర్టులు వస్తున్నాయి. ఫుడ్‌ డెలివరీ అనేది ఒక సర్వీస్‌ కాబట్టి దాని పన్ను శ్లాబుకు తగినట్లు జిఎస్‌టి చెల్లించాలని డిజిజిఐ తెలిపింది. ఈ సేవలపై 5 శాతం పన్ను రేటు అమల్లో ఉంది.

➡️