మరిన్ని రాష్ట్రాలకు డ్రోగో డ్రోన్స్‌ విస్తరణ

Feb 20,2024 21:24 #Business

హైదరాబాద్‌ : వచ్చే కొన్ని మాసాల్లో మరిన్ని రాష్ట్రాలకు విస్తరించనున్నట్లు డ్రోగో డ్రోన్స్‌ తెలిపింది. విక్షిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర ప్రాజెక్ట్‌ (విబిఎస్‌వై) కోసం అనేక రాష్ట్రాలలో డ్రోన్‌లను విజయవంతంగా వాడినట్లు తెలిపింది. ఐఎఫ్‌ఎఫ్‌సిఒ, ఎఫ్‌ఎసిటి, ఎన్‌ఎఫ్‌ఎల్‌ భాగస్వామ్యంతో తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ ఛత్తీస్‌గఢ్‌లలో 300కి పైగా డ్రోన్‌లను విజయవంతంగా ఉపయోగించినట్లు డ్రోగ్‌ డ్రోన్స్‌ సిఇఒ యశ్వంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో డ్రోగో తన డ్రోన్‌ సర్వీస్‌ సెంటర్లను ఏర్పాటు చేసిందన్నారు. ఇవి రైతులకు సేవలను అందించేలా క్రిమిసంహారక మందులను స్ప్రే చేస్తున్నాయన్నారు.

➡️