మహీంద్రా నుంచి సుప్రో ప్రాఫిట్‌ ట్రక్‌ ఎక్సల్‌

Jan 23,2024 21:30 #Business

న్యూఢిల్లీ : ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ మహీంద్రా అండ్‌ మహీంద్రా కొత్తగా సుప్రో ప్రాఫిట్‌ ట్రక్‌ ఎక్సల్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ.6.61 లక్షలుగా నిర్ణయించింది. దీన్ని 900 కిలోలు, 750 కిలోల పెలోడ్‌ సామర్థ్యంతో ఆవిష్కరించింది. ఇది డీజిల్‌, సిఎన్‌జి డ్యుయో వేరియంట్‌లో లభ్యమవుతందని తెలిపింది. కొత్త మహీంద్రా సుప్రో ప్రాఫిట్‌ ట్రక్‌ ఎక్సెల్‌ బహుళ ఇంజిన్‌, ఇంధన ఎంపికలు, ఆధునిక శైలి, అధునాతన భద్రత, సాంకేతికత ఫీచర్లతో డిజైన్‌ చేశామని ఎంఅండ్‌ఎం ఆటోమోటివ్‌ డివిజన్‌ సిఇఒ నళినీ కాంత్‌ గొల్లగుంట తెలిపారు. సుప్రో ఎక్సల్‌ డీజిల్‌ లీటర్‌కు 23.6 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందన్నారు.

➡️