విద్యుత్‌ బస్‌ అమ్మకాలు పెరగొచ్చు : ఇక్రా

Nov 28,2023 08:58 #Business

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో దేశంలోని మొత్తం బస్సుల అమ్మకాల్లో విద్యుత్‌ బస్సుల వాటా 11-13 శాతానికి చేరొచ్చని రేటింగ్‌ ఎజెన్సీ ఇక్రా అంచనా వేసింది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇవి బస్సులకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటుగా కొన్ని సంస్థలకు గడువు లక్ష్యాలను నిర్దేశించడంతో వీటి అమ్మకాలు పెరగనున్నాయని పేర్కొంది. గడిచిన 2022-23లో ఇవి బస్‌ల వాటా 7 శాతంగా ఉందని వెల్లడించింది. ఇ-బస్‌ల తయారీకి ప్రభుత్వాలు సబ్సీడీలు ఇవ్వడం, టెక్నాలజీ, పెట్టుబడుల వ్యయం తగ్గడంతో ఈ రంగానికి మద్దతు లభిస్తుందని ఇక్రా పేర్కొంది.

➡️