వివో మనీలాండరింగ్‌ కేసులో మరో ముగ్గురి అరెస్టు

Dec 23,2023 21:30 #Business

న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ఉత్పత్తుల కంపెనీ వివో ఇండియా మనీలాండరింగ్‌ కేసులో తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ (ఇడి) మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఇప్పటికే నలుగురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వివోతో పాటు మరి కొన్ని సంస్థల మనీలాండరింగ్‌ కేసును దర్యాప్తు చేసిన ఇడి పలు సెక్షన్ల కింద వివో ఇండియాపై అభియోగాలు మోపింది. వివో రూ.62,476 కోట్ల పన్ను ఎగవేతలకు పాల్పడిందని గతేడాది ఇడి సోదాల్లో వెల్లడయ్యింది.

➡️