విశాఖ నుంచి కౌలాలంపూర్‌కు ఎయిర్‌ ఆసియా సేవలు

Feb 2,2024 21:30 #Business

-రూ.4,999కే విమానయానం

హైదరాబాద్‌ : విశాఖపట్నం నుంచి కౌలాలంపూర్‌ మధ్య డైరెక్ట్‌ విమాన సేవలను తిరిగి అందుబాటులోకి తెస్తున్నట్లు ఎయిర్‌ ఆసియా వెల్లడించింది. 2024 ఏప్రిల్‌ 26 నుంచి విశాఖపట్నం నుండి మలేషియా రాజధాని కౌలాలంపూర్‌కు వారానికి మూడు సార్లు విమానాలను నడపనున్నట్లు తెలిపింది. భిన్న సంస్కృతులు కలిగిన మలేషియా ఆహార ప్రియులకు స్వర్గధామమని పేర్కొంది. హిందూ శిల్పాలు, పుణ్యక్షేత్రాలతో అలంకరించబడిన గుహలు, విస్మయాన్ని కలిగించే సున్నపురాయి కొండ, ఐకానిక్‌ ‘బటు గుహల’ను సందర్శించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతారని పేర్కొంది. విశాఖపట్నం నుండి కౌలాలంపూర్‌కి విమాన బుకింగ్‌ 14 ఫిబ్రవరి 2024 వరకు కేవలం రూ4,999కే ప్రారంభ ధరతో బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది. ఇది 26 ఏప్రిల్‌ 2024 నుంచి 19 మార్చి 2025 మధ్య ప్రయాణం కోసం మాత్రమే వర్తిసుందని ఎయిర్‌ ఆసియా ఏవియేషన్‌ గ్రూప్‌ సిఇఒ బో లింగం పేర్కొన్నారు. ”మాకు అతిపెద్ద అంతర్జాతీయ మార్కెట్‌లలో ఒకటి భారతదేశం. మేము అందరి ప్రయాణాన్ని సరసమైనదిగా, అందరికీ అందుబాటులో ఉండేలా చేయడం వల్ల వినియోగదారుల నుంచి రోజురోజుకి మద్దతు పెరుగుతుంది. మా ఉనికిని మరింత విస్తరించడానికి, మా రెండు దేశాల మధ్య వెలుపల మరింత సరసమైన కనెక్టివిటీని అనుమతించాలని నిర్దేశించుకున్నాం.” అని బో లింగం పేర్కొన్నారు. విశాఖపట్నం నుంచి థారులాండ్‌ రాజధాని బ్యాంకాక్‌కు ఏప్రిల్‌ 9 నుంచి వారానికి మూడు సార్లు విమాన సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు ఎయిర్‌ ఆసియా పేర్కొంది.

➡️