హిల్టన్‌ మెటల్‌కు రూ.42 కోట్ల ఆదాయం

Mar 6,2024 21:00 #Business

ముంబయి : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 44 శాతం వృద్థితో రూ.42 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసినట్లు హిల్టన్‌ మెటల్‌ ఫోర్జింగ్‌ తెలిపింది. సంస్థ నికర లాభాలు 68 శాతం పెరిగి రూ.2.1 కోట్లుగా చోటు చేసుకున్నట్లు పేర్కొంది. 2023-24 తొలి తొమ్మిది మాసాల్లో సంస్థ నికర లాభాలు 82 శాతం పెరిగి రూ.6.14 కోట్లుగా, ఆదాయం 41 శాతం వృద్థితో రూ.105 కోట్లుగా నమోదయ్యిందని తెలిపింది.

➡️