ఒక్క రోజులో 4.63 లక్షల మంది విమానయానం

Nov 25,2023 21:20 #Business

న్యూఢిల్లీ : భారత పౌర విమానయాన రంగం నూతన రికార్డ్‌ను సృష్టించింది. ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా గురువారం ఒక్క రోజునే 4,63,417 మంది విమానాల్లో ప్రయాణించారని కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సిందియా ట్వీట్‌ చేశారు. 5,998 విమాన సర్వీసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఈ ఏడాది నవంబరులో ప్రయాణికుల సంఖ్య రికార్డ్‌ స్థాయిలో నాలుగు రెట్లు పెరిగిందని వెల్లడించారు.

➡️