పర్సనలైజ్డ్‌ మెడిసిన్‌కు డిమాండ్‌ : డాక్టర్ రెడ్డీస్ లాబరేటరీ ఎపిఐ అండ్ సర్వీసెస్ సీఈఓ దీపక్ సప్రా

హైదరాబాద్‌ : పర్సనలైజ్డ్‌ మెడిసిన్‌ (వ్యక్తిగతీకరించిన ఔషధం)లకు డిమాండ్‌ పెరుగుతుందని డాక్టర్ రెడ్డీస్ లాబరేటరీ ఎపిఐ అండ్ సర్వీసెస్ సీఈఓ దీపక్ సప్రా అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన డిఎక్స్‌ఇఎం 2024 సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఐదేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా 15 నుండి 20 కొత్త పర్సనలైజ్డ్‌ మందులు రావొచ్చన్నారు. ఈ విషయంలో భారత్‌ కూడా అత్యంత అభివద్ధి చెందిన దేశాలతో సమానంగా పురోగమిస్తోందన్నారు. కొత్త ఔషధ ఆవిష్కరణకు 10 నుండి 15 సంవత్సరాలు అవసరం ఉంటుందన్నారు. ఇందుకోసం వేల కోట్ల రూపాయలు వ్యయం చేయాల్సి ఉంటుందన్నారు. టెక్నాలజీతో ఆధారితమైన ఇన్నోవేషన్‌ సహకారం వల్ల డ్రగ్స్‌ని వేగంగా, తక్కువ ఖర్చుతో కనుగొనడానికి అవకాశాలు మెరుగుపడ్డాయన్నారు. భారత కంపెనీలు తమ లాభాల్లోంచి కేవలం 0.8 శాతం మాత్రమే ఆర్‌అండ్‌డి కోసం ఖర్చు చేస్తున్నాయని.. అదే దక్షిణ కొరియాలో 5.2 శాతం వ్యయం చేస్తున్నాయన్నారు.

➡️