ఎండిహెచ్‌ 31 శాతం ఉత్పత్తులు తిరస్కరణ

Apr 29,2024 23:00 #Business, #mdh
  •  ఆరు నెలల్లో వెనక్కి పంపిన అమెరికా

న్యూఢిల్లీ : గడిచిన ఆరు నెలల్లో 31 శాతం ఎండిహెచ్‌ మసాల ఉత్పత్తులను అమెరికా తిరస్కరించింది. యునైటెడ్‌ స్టేట్స్‌ కస్టమ్స్‌ అధికారులు 2023 అక్టోబర్‌ నుంచి ఇప్పటి వరకు 11 షిప్‌మెంట్లను వెనక్కి పంపారు. ఇటీవల ఎండిహెచ్‌ ఉత్పత్తులను హాంకాంగ్‌, సింగపూర్‌ ప్రభుత్వాలు నిషేధించడంతో తాజాగా అమెరికా చర్యలు కూడా బయటికి వచ్చాయని ఓ ఆంగ్ల పత్రిక రిపోర్ట్‌ చేసింది. ఎండిహెచ్‌ ఉత్పత్తుల తిరస్కరణ రేటు రెండింతలు పెరిగిందని అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ గణంకాల్లో తేలింది. అక్టోబర్‌ 2022-సెప్టెంబర్‌ 2023 మధ్య కాలంలో తిరస్కరణ రేటు 15 శాతంగా ఉండగా.. గడిచిన ఆరు నెలల్లో ఇది 31 శాతానికి చేరడం గమనార్హం.

➡️