ఎంజి మోటార్‌ కొత్త ఆస్టర్‌ ఆవిష్కరణ

Jan 12,2024 21:30 #Business

హైదరాబాద్‌ : ఎంజి మోటార్‌ ఇండియా కొత్త ఆస్టర్‌ 2024ను ఆవిష్కరించింది. దీని ఎక్స్‌షోరూం ప్రారంభ ధరను రూ.9.98 లక్షలుగా నిర్ణయించింది. ఈ కొత్త వేరియంట్‌ను గురువారం హైదరాబాద్‌లో ఎంజి మోటార్‌ ఇండియా డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గౌరవ్‌ గుప్తా విడుదల చేశారు. ఈ కొత్త వేరియంట్‌లో స్ప్రింట్‌, షైన్‌, సెలెక్ట్‌, షార్ప్‌ ప్రో, సావీ ప్రో మోడళ్లను అధునాతన యూజర్‌ ఇంటర్‌ఫేస్‌తో అప్‌డేట్‌ చేయబడిన ఐఎస్‌ఎంఎఆర్‌టి 2.0తో అందుబాటులోకి తెచ్చామన్నారు. ఎంజి ఆస్టర్‌ను 49 ఆధునిక బద్రతా ఫీచర్స్‌తో రూపకల్పన చేశామన్నారు.

➡️