అదానీ కంపెనీ చేతికి మై హోం గ్రైండింగ్‌ యూనిట్‌

Apr 15,2024 20:57 #ambuja cement, #Business

న్యూఢిల్లీ : అదానీ గ్రూపునకు చెందిన అంబుజా సిమెంట్స్‌ తమిళనాడులోని తూత్తుకుడిలో మై హోం గ్రూప్‌నకు చెందిన ఏడాదికి 1.50 మెట్రిక్‌ టన్నుల సిమెంట్‌ గ్రైండింగ్‌ యూనిట్‌ను రూ.413.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ప్లాంట్‌ పోర్ట్‌ సమీపంలో 61 ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ ఒప్పందంతో దక్షిణాది మార్కెట్లలో అంబుజా సిమెంట్స్‌ తన ఉనికిని మరింత పెంచుకున్నట్లయ్యింది.

➡️