ఐటి ఇ-ధృవీకరణ స్కీంపై సెమినార్‌

Dec 26,2023 21:25 #Business

హైదరాబాద్‌ : ఆదాయపు పన్ను ఇ-ధృవీకరణ స్కీంపై చర్చాగోష్టి కార్యక్రమం జరిగింది. మంగళవారం హైదరాబాద్‌లోని ఎఫ్‌టిసిసిఐ కార్యాలయంలో ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసిఎఐ)తో కలిసిన నిర్వహించిన ఈ సమావేశానికి ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇన్‌కం టాక్స్‌ సునీతా బైన్‌స్లా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 200 పైగా సిఎలు, పన్ను చెల్లింపుదారులు హాజరైన ఈ సమావేశంలో సునీతా మాట్లాడుతూ.. ఇ-వెరిఫికేషన్‌ నిబంధనలు పాటించని కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని పేర్కొన్నారు. స్వచ్ఛంద పన్ను సమ్మతిని ప్రోత్సహించడానికి, పారదర్శకతతో కూడిన పన్ను పరిపాలనను సులభతరం చేయడానికి ఇ-ధఅవీకరణ పథకం 2021ని కేంద్రం నోటిఫై చేసిందని ఆమె గుర్తు చేశారు. హైదరాబాద్‌లోనూ ఇ-ధఅవీకరణ పథకం పెండింగ్‌లో ఉన్న కేసులు పెద్ద సంఖ్యలో ఉండటం చాలా ఆందోళన కలిగించే అంశమన్నారు. ప్రజలు డిపార్ట్‌మెంట్‌కు కట్టుబడి, సహకరించాలని ఆమె కోరారు. ఆస్తులు, అప్పులకు సరైన మూల్యాంకనాన్ని చూపాలనే లక్ష్యంతో ఇ-ధృవీకరణ పథకం ప్రవేశపెట్టామన్నారు. ఎఫ్‌టిసిసిఐ ప్రెసిడెంట్‌ మీలా జయదేవ్‌ మాట్లాడుతూ.. ఇ-వెరిఫికేషన్‌ స్కీమ్‌ పన్ను చెల్లింపుదారుల నుండి మరింత సమాచారాన్ని సేకరించడానికి, ఇతర నిర్దిష్ట ఏజెన్సీల నుండి అందుకున్న సమాచారంతో పోల్చుకోవడానికి ప్రభుత్వం పన్ను కార్యాలయానికి అధికారం ఇస్తోందన్నారు.

➡️