ఐటి కంపెనీల రెవెన్యూలో స్తబ్దత

Apr 24,2024 21:25 #Business

న్యూఢిల్లీ : భారత ఐటి కంపెనీల రెవెన్యూలో స్తబ్దత చోటు చేసుకోనుందని ప్రముఖ రేటింగ్‌ ఎజెన్సీ క్రిసిల్‌ అంచనా వేసింది. అమెరికా, యూరప్‌ లాంటి అంతర్జాతీయ సూక్ష్మ గణంకాల్లో నెలకొన్న ఒత్తిడి ఐటి కంపెనీలపై ప్రతికూల ప్రభావాన్ని చూపనుందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఏడాదికేడాదితో పోల్చితే రెవెన్యూలో 5ా7 శాతం పెరుగుదల ఉండొచ్చని పేర్కొంది. గడిచిన 2023-24లో 6 శాతం లోపు వృద్థి చోటు చేసుకుందని పేర్కొంది. గత దశాబ్ద కాలంలో సగటున 12 శాతం వృద్థి నమోదయ్యింది. దీంతో పోల్చితే వరుసగా రెండేళ్ల పాటు ఐటి రంగం ఒత్తిడిని ఎదుర్కొనుందని క్రిసిల్‌ పేర్కొంది. అమెరికా, యూరప్‌ మార్కెట్లలో ఐటిపై వ్యయాలు తగ్గించుకోవడమే ప్రధాన కారణమని తెలిపింది.

➡️