జమాటోకు రూ.175 కోట్ల లాభాలు

May 13,2024 22:40 #Business

ముంబయి : ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జమాటో 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.175 కోట్ల నికర లాభాలు ప్రకటించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.188 కోట్ల నష్టాలు చవి చూసింది. గడిచిన త్రైమాసికంలో సంస్థ ఫుడ్‌ డెలివరీ వ్యాపారం స్థూల ఆర్డర్‌ విలువ (జిఒవి) 28 శాతం పెరిగి రూ.8,439 కోట్లుగా నమోదయ్యింది. కాగా.. 2023ా24లో మొత్తంగా రూ.351 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం 2022ా23లో రూ.971 కోట్ల నష్టాలు నమోదు చేసింది. గడిచిన మార్చి త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ రూ.3,562 కోట్లకు చేరింది. 2022ా23 ఇదే త్రైమాసికంలో రూ.2,056 కోట్లుగా ఉంది.

➡️