అంగన్‌వాడీల రాస్తారోకో..

Dec 27,2023 21:45
ఫొటో : అనంతసాగరంలో రాస్తారోకో నిర్వహిస్తున్న అంగన్‌వాడీలు

ఫొటో : అనంతసాగరంలో రాస్తారోకో నిర్వహిస్తున్న అంగన్‌వాడీలు
అంగన్‌వాడీల రాస్తారోకో..
ప్రజాశక్తి-అనంతసాగరం : రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీలతో జరిపిన చర్చలు విఫలమవడంతో బుధవారం అనంతసాగరం ఐసిడిఎస్‌ ప్రాజెక్టు అంగన్‌వాడీ వర్కర్‌ అండ్‌ హెల్పర్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు బస్టాండ్‌ సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య, వ్యకాసం జిల్లా కార్యదర్శి మంగల పుల్లయ్యలు పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను నేరవేర్చమని నిరసనలు తెలుపుతున్నారన్నారు. కనీస వేతనం రూ.26వేలు, పిల్లలకు సరఫరా చేసే పాలు, గుడ్లు నాణ్యమైనవి అందించాలన్నారు. మినీ అంగన్‌వాడీలను మెయిన్‌ కేంద్రాలుగా మార్చాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు అనంతసాగరం మండల కార్యదర్శి అన్వర్‌ బాషా, ఆవాజ్‌ మర్రిపాడు మండల కార్యదర్శి రహంతుల్లా, అనంతసాగరం ఐసిడిఎస్‌ ప్రాజెక్టు అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు సునీత, లక్ష్మి, సుబ్బమ్మ, వసుంధర, నూర్జహాన్‌, భాగ్యమ్మ, అంగన్‌వాడీలు పాల్గొన్నారు.

➡️