అంగన్‌వాడీల ‘వంటావార్పు’

Dec 19,2023 21:56 #Anganwadi strike
ఫొటో : వంటావార్పు కార్యక్రమాన్ని చేపడుతున్న అంగన్‌వాడీలు

ఫొటో : వంటావార్పు కార్యక్రమాన్ని చేపడుతున్న అంగన్‌వాడీలు
అంగన్‌వాడీల ‘వంటావార్పు’
ప్రజాశక్తి-అనంతసాగరం : అంగన్‌వాడీల సమ్మెలో భాగంగా అనంతసాగరం ప్రాజెక్టు వద్ద మంగళవారం అంగన్‌వాడీలు వంటావార్పు కార్యక్రమం నిర్వహించి తమ నిరసనను తెలియజేశారు. అంగన్వాడీల సమ్మెకు కౌలు రైతుసంఘం, యుటిఎఫ్‌, ఆవాజ్‌ పలు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ అంగన్‌వాడీల సమ్మెలో నిజాయితీ ఉందని అనేకమార్లు ప్రభుత్వానికి తమ సమస్యలను విన్నవించుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని తప్పని పరిస్థితిలో సమ్మె చేస్తున్నామన్నారు. ప్రభుత్వం అంగన్‌వాడీలతో సామరస్య ధోరణిలో చర్చలు జరిపి సమ్మె విరమించే విధంగా ప్రయత్నాలు చేయాలి తప్ప, ప్రభుత్వం దౌర్జన్యంగా అంగన్‌వాడీ సెంటర్ల తాళాలను పగలగొట్టి సమ్మెను నిర్వీర్యం చేయాలని ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. అంగన్‌వాడీల సమ్మెకు పూర్తిస్థాయిలో తమ మద్దతు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గంటా లక్ష్మీపతి, ఆవాజ్‌ జిల్లా కార్యదర్శి రషీద్‌, యుటిఎఫ్‌ మండల కార్యదర్శి వద్దిబోయిన వెంకటేశ్వర్లు రెడ్డి, యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు పాపిశెట్టి నరసింహులు, వలీ అహ్మద్‌, సిఐటియు మండల కార్యదర్శి అన్వర్‌ బాషా, మర్రిపాడు మండలం సిఐటియు కార్యదర్శి బత్తల రత్తయ్య, మర్రిపాడు మండలం ఆవాజ్‌ నాయకులు రహమతుల్లా, గౌస్‌ బాషా అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అనంతసాగరం ప్రాజెక్టు నాయకులు సునీత, లక్ష్మీ, సుబ్బమ్మ, వసుంధర, నూర్జహా భాగ్యమ్మ, మర్రిపాడు మండలం ఆశా వర్కర్స్‌ యూనియన్‌ కార్యదర్శి, మిడ్‌ డే మీల్స్‌ మండల కార్యదర్శి, అనంతసాగరం ప్రాజెక్టులోని వర్కర్లు హెల్పర్లు పాల్గొన్నారు.

➡️