అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి

Nov 29,2023 23:34 #జె.లలితమ్మ

ప్రజాశక్తి-మార్కాపురం రూరల్‌ : అంగన్‌వాడీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.లలితమ్మ డిమాండ్‌ చేశారు. స్థానిక పూల సుబ్బయ్య శాంతిభవనం వద్ద అంగన్‌వాడీల అర్బన్‌ శాఖ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా లలితమ్మ మాట్లాడుతూ అంగన్‌వాడీలకు ప్రభుత్వ పథకాలన్నీ వర్తింపజేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అంగన్‌వాడీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల అద్దె, కరెంట్‌ బిల్లులు, కూరగాయల బిల్లులు సకాలంలో చెల్లించాలన్నారు. నెలవారీ గౌరవ వేతనం రూ.16,000 పెంచాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలన్నారు. మినీ అంగనాడీలను మెయిన్‌ కేంద్రాలుగా మార్చాలన్నారు. అంగన్‌వాడీలపై యాప్‌ల భారాన్ని తగ్గించాలన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే డిసెంబర్‌ 8 నుంచి అంగన్‌వాడీలు నిర్వధిక సమ్మె చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు అందే నాసరయ్య, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి షేక్‌ ఖాసిం, ఎఐటియుసి నియోజక వర్గ అధ్యక్షుడు వెంకట్‌ రెడ్డి, రాష్ట్ర ఆఫీస్‌ బేరర్‌ రేణుక, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరత్నం, నారాయణమ్మ, ధనలక్ష్మి, అంగన్‌వాడీలు తదితరులు పాల్గొన్నారు.

➡️