అక్రమ అరెస్టులకు నిరసనగా సమగ్ర శిక్ష ఉద్యోగుల ధర్నా

Jan 5,2024 19:59

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు చలో విజయవాడ తరలివెళ్లారు. అయితే వారిని పోలీసులు విజయవాడలో అక్రమంగా నిర్బంధించి అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ కలెక్టరేట్‌ వద్ద శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు కె.త్రినాధరావు మాట్లాడుతూ ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనాలు చెల్లించాలని, ముఖ్యమంత్రి కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని 17రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ముఖ్య మంత్రి దృష్టికి సమస్యలను తీసుకెళ్లాలని చలో విజయవాడ కు వెళ్తే పోలీసులు అన్యాయంగా అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సమస్యలు పరిష్కారం చేయాలని, లేకుంటే ఉద్యమం మరింత ఉధతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️