అగ్ని ప్రమాద బాధితులకు దాతల సాయం

Dec 25,2023 14:53 #chitoor

ప్రజాశక్తి-వెదురుకుప్పం(చిత్తూరు) : మండలంలోని దిగవ పల్లాలు గ్రామానికి చెందిన కె.సెల్వి ఇల్లు విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో సెల్వి కుటుంబ సభ్యులు సుమారు లక్ష రూపాయల ఆస్తి నష్టం జరిగిందని వాపోయారు. ఈ విషయం తెలుసుకున్న పచ్చికాపలంలోని శ్రీ లక్ష్మీ మొబైల్‌ అధినేత ప్రసాద్‌ బాధితులకు రూ.5 వేత ఆర్థిక సాయంతో పాటు నిత్యవసర సరుకులు పంపిణీ చేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఆయన వెంట శ్రీ లక్ష్మీ మొబైల్స్‌ సిబ్బంది ఉన్నారు.

➡️