అగ్రహారం భూ సమస్య పరిష్కారానికి కృషి: కోళ్ల

Mar 27,2024 21:22

ప్రజాశక్తి – జామి : భీమసింగి సహకార ఫ్యాక్టరీని నిలబెట్టుకోవడంతో పాటు జామి అగ్రహార భూ సమస్య పరిస్కారమే లక్ష్యంగా పని చేస్తానని మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి హామీ ఇచ్చారు. బుధవారం జామి గ్రామం నుంచి ఎన్నికల శంఖరావం చేశారు. ముందుగా యల్లమాంబా, శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, జామి దొండపర్తి జంక్షన్‌ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మాజీ జెడ్‌పిటిసి బండారు పెదబాబు అధ్యక్షతన జరిగిన సభలో కోళ్ల మాట్లాడారు. ప్రజా సమస్యలు పరిస్కారానికి, ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వర్రీ రమణ, వేండ్రపు నాయుడుబాబు, జనసేన నాయకులు వర్మరాజు, శ్రీలక్ష్మి, బాలరాంపురం, భీమసింగి నాయకులు తదితరులు పాల్గొన్నారు.వార్డుల్లో బేబినాయన ప్రచారంబొబ్బిలి: టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థి బేబినాయన పట్టణంలోని ఐదో వార్డులో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి చేసేందుకు తనకు ఓటు వేసి గెలిపించాలని బేబినాయన ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్దించారు. ప్రచారంలో టిడిపి పట్టణ అద్యక్షులు రాంబర్కి శరత్‌, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ గెంబలి శ్రీనివాసరావు, కౌన్సిలర్‌ వి.హైమవతి, తదితరులు పాల్గొన్నారు.బేబినాయనకు పట్టణ కళాసీ సంఘం మద్దతుటిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయనకు పట్టణ కళాసీ సంఘం మద్దతు ప్రకటించింది. కోటలో బేబినాయనను పట్టణ కళాసీ సంఘం అధ్యక్షులు బి.అప్పలస్వామి, నాయకులు వై.అప్పారావు, పి.రామకృష్ణ, పి.అప్పారావు, కళాసీ సంఘం సభ్యులు కలిసి మద్దతు ప్రకటించారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటున్న బేబినాయనకు అండగా ఉంటామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఆయన విజయానికి పని చేస్తామన్నారు. తనకు మద్దతు ఇచ్చిన కళాసీ సంఘం నాయకులు, సభ్యులకు బేబినాయన కృతజ్ఞతలు తెలిపారు.

➡️