అడుగడుగునా ఆటంకం

ప్రజాశక్తి-మదనపల్లి 41 రోజులుగా రోజులుగా సమ్మె చేస్తున్నా అంగన్వాడీల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాలు సేకరించి ఈనెల 22న విజయవాడకు వెళ్తున్న అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించింది. ఆదివారం స్థానిక పిటిఎం రైల్వేస్టేషన్‌లో విజయవాడ బయ లుదేరిన అంగన్వాడీలను పోలీసులు బలవంతంగా రైలు ఎక్కుతున్న మహిళలను దింపివేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, అంగన్వాడీలకు మద్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మఫ్టీలో ఉన్న రూరల్‌ ఎస్‌ఐ సుధాకర్‌ బూతులు తిడుతూ రెచ్చిపోయి అంగన్వాడీలపై దాడికి యత్ని ంచారు. ఆయన వైఖరిని నిరసిస్తూ సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు రైలు ప్లాట్‌ ఫాం మీద బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ సుధాకర్‌ సిపియం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులపై దాడికి యత్నించారు. అంగన్వాడీలు, ప్రయాణికులు పోలీసులను అడ్డుకున్నారు. రైలు దింపిన అంగన్వాడీలను అరెస్టు చేసి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అక్రమ అరెస్టుకు నిరసనగా రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ అంగన్‌వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పడం దుర్మార ్గమన్నారు. శాంతి యుతంగా 4 రోజులుగా సమ్మె చేస్తున్నా అంగన్వాడీల సమస్యలు పట్టించుకోకపోగా బెదిరింపులకు పాల్పడిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జగనన్నకు చెబుతామని బయలుదేరిన వారిపై నిర్బంధించడం దాష్టికమని చెప్పారు. మఫ్టీలో వచ్చి మహిళలపై దాడి చేస్తూ దుర్భాషలాడిన రూరల్‌ ఎస్‌ఐ సుధాకర్‌ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. శాంతియుతంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని లేదంటే ఉద్యమం మరింత ఉధతం అవుతుందని హెచ్చరించారు. అరెస్ట్‌ అయిన వారిలో అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ మదనపల్లి ప్రాజెక్టు అధ్యక్షులు డిఆర్‌ మధురవాణి, సిఐటియు మండల కార్యదర్శి గంగాదేవి, వసుంధర, సుందరి, రత్నమ్మ, లతో పాటు 15 మంది ఉన్నారు. లక్కిరెడ్డిపల్లి : అంగన్వాడీల న్యాయమైన హక్కులు సాధన కోసం విజయవాడ వెళ్తున్న లక్కిరెడ్డిపల్లి అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అక్రమ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు కార్యదర్శి ఓబులమ్మ మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేస్తామని చెప్పారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదని అని అన్నారు మధ్యాహ్నం నుంచి లక్కిరెడ్డిపల్లి పోలీసులు తమల్ని అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌ తీసుకెళ్లి సాయంత్రం వరకు ఉంచుకున్నారని. ఎస్‌ఐ విష్ణువర్ధన్‌ తమ దగ్గర సంతకాలు తీసుకుని వదిలారని ప్రాజెక్టు కార్యదర్శి అన్నారు రాజంపేట అర్బన్‌ : డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు చేపడుతున్న నిరవధిక సమ్మె ఆదివారానికి 41వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ఆదివారం ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీలు నిరసన తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు శివరంజని, పార్వతి పాల్గొన్నారు. బి.కొత్తకోట : డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని అంగన్వాడీలు స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా,తంబళ్లపల్లి నియోజక వర్గం ,బి.కొత్తకోట ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద గత 41 రోజుల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, పూర్తిగా విధులకు దూరమై అంగన్వాడీ సెంటర్లను మూసివేసిన విషయం తెలిసిందే. తమన్యాయమైన డిమాండ్లును ప్రభుత్వం వరకు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా అంగన్వాడీ సెంటర్లను తెరిచేది లేదని చెప్పారు. అంగన్వాడీలు విధులకు దూరం కావడం వల్ల గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలకు పౌష్టికాహారం అందడం లేదని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లు పరిష్కరించి ఆందోళనను విరమింపజేయాలని కోరారు.

➡️